అన్ ఆర్డినరీ మ్యాన్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న కనీషా!

రిపోర్టర్: అశోక్ స్థలం: తమిళనాడు

ట్రోలింగ్ కారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకురాలు కనీషా ఫ్రాన్సిస్ రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు రవి మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అన్ ఆర్డినరీ మ్యాన్' చిత్రానికి ఆమె సంగీతం అందించనున్నారు. రవి మోహన్ స్టూడియోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో తీవ్ర విమర్శల కారణంగా ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.