యాదాద్రి దివ్యక్షేత్రంలో భక్తుల వసతుల కోసం నూతన కళ్యాణ మండప నిర్మాణం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి ప్రస్థానానికి మరో ముందడుగు పడింది. కొండపైన స్వామివారి దివ్యసన్నిధిలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవస్థాన చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. ఈ నూతన మండపం ద్వారా భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.