ఎమ్మెల్యే కూన రవి తీరుపై వైసీపీ నేతల ధ్వజం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జడ్పీటీసీ సభ్యుడిని ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని తోసేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరమని వారు ఆరోపించారు.

నరసన్నపేటలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, స్థానిక సంస్థల ప్రతినిధుల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.