వైకాపా జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నియామకం
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను అధిష్ఠానం నియమించింది. పార్టీ వీడిన మజ్జి శ్రీనివాసరావు స్థానంలో ఈ నియామకం జరిగింది. నెల్లిమర్ల సమన్వయకర్తగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడిని ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో గదల సన్యాసినాయుడిని నియమించారు. పార్టీ సమావేశంలో అప్పలనాయుడు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.