రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Moscow

రష్యా లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలపై ఏకకాలంలో వెయ్యికి పైగా డ్రోన్లతో విరుచుకుపడటంతో చమురు డిపోల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. సెయింట్ పీటర్స్బర్గ్ దాడుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రరూపం దాల్చింది.