కరువు నివారణకు ఇరవై వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తిన తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు నివారణకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.