మురసు తుఫాన్ ప్రభావం: బాపట్ల రహదారిపై కూలిన చెట్ల తొలగింపు
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
మురసు తుఫాన్ సహాయక చర్యల్ లో భాగంగా బాపట్ల జిల్లాలోని బాపట్ల–ముత్తాయపాలెం రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తూ రాకపోకలను APSDRF బృందం పునరుద్ధరించిందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రజల భద్రతను కాపాడటమే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సహాయక కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.