నెల్లూరు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో భేటీ: నాణ్యమైన విద్యే శాశ్వత ఆస్తి

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆర్ఎస్ఆర్, డిఎస్ఆర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులతో మాట్లాడానని పొంగూరు నారాయణ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఎనభై వేల ఇళ్లకు వెళ్లి పేద పిల్లల కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యే శాశ్వత ఆస్తి అని, ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆర్ఎస్ఆర్ పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.