గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పోరు తప్పదంటూ రైతన్నల గళం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో తెలంగాణ రైతు సంఘం ఆవధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని వారు స్పష్టం చేశారు.