ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుతో రాజకీయంగా కలకలం

రిపోర్టర్: మహేష్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్‌తో పాటు ఐటీ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుకు సమన్లు జారీ చేయడం తీవ్రతను పెంచింది. ఈ కుంభకోణంలో అసలు సూత్రధారిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత పి.వి.ఎన్. మాధవ్ డిమాండ్ చేస్తుండగా, మనీ ట్రయల్ ఆధారంగా ఈడీ విచారణ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుండటం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.