టీపీసీసీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శిగా హేమంత్ చారి బాధ్యతలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన హేమంత్ చారి టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సోమవారం రాత్రి రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ నవీన్ పెట్టం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హేమంత్ చారి తెలిపారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.