విజయనగరం పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే పోటెత్తిన ఓటర్లు
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో 27 జెడ్పీటీసీ మరియు 438 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 1586 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. 793 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు మరియు వీడియో రికార్డింగ్ ద్వారా ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా ఉంచి పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తూ ప్రజలను ఓటు హక్ కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.