జయపూర్ లైవ్ కాన్సర్ట్ లో భయానక ఘటన: స్టేజ్‌పైకి దూసుకెళ్లిన అభిమానితో సునంద శర్మ షాక్
రిపోర్టర్: అశోక్
స్థలం: జయపూర్
ప్రముఖ గాయని సునంద శర్మ లైవ్ కాన్సర్ట్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. జయపూర్ లోని ఆనంద్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ఇస్తుండగా, సడన్‌గా ఒక అభిమాని స్టేజ్‌పైకి దూసుకెళ్లాడు. ఈ అనూహ్య పరిణామానికి తీవ్ర భయానికి గురైన సునంద శర్మ బిగ్గరగా కేకలు వేశారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కిందకు దించేసినప్పటికీ, తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తన ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేసి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు నిర్వహకులు తెలిపారు.