నల్లగొండలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నల్లగొండ
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లాలో యువ టూరిజం క్లబ్ సభ్యులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం, ఇన్ఫర్మేషన్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ తెలిపారు. విద్యాశాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణ లక్ష్యాల సాధన కోసం సెప్టెంబర్ 22న నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో, సెప్టెంబర్ 24న దేవరకొండ ఖిల్లా వద్ద ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.