రీల్స్ కోసం బరితెగింపు: పెట్రోల్ పోసి యువకుడికి నిప్పు పెట్టిన కిరాతకులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కొల్‌కతా

సోషల్ మీడియాలో రీల్స్ చేసే పిచ్చి నెట్టింట హద్దులు దాటుతోంది. కోల్కతాలోని గర్ఫా ప్రాంతంలో ఓ యువకుడిని బలిపశువును చేసేందుకు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. గేమ్ ఆడుతామంటూ నమ్మించి బాధితుడికి బలవంతంగా పెట్రోల్ తాగించి, నిప్పుంటించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.