ది ప్యారడైజ్ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. సెప్టెంబర్ 23న సాయంత్రం ప్రత్యేక షోకు ఐదు వందల రూపాయల ఫిక్స్‌డ్ ధర నిర్ణయించగా, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు సింగిల్ స్క్రీన్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో అదనపు ధరలు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.