తుఫాన్ ప్రభావంతో కిర్లంపూడి మండలంలో నీట మునిగిన వరి పంట

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

తుఫాన్ ప్రభావంతో కిర్లంపూడి మండలంలోని రామకృష్ణాపురం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను వ్యవసాయ అధికారిణి సుధామాధురి గురువారం పరిశీలించారు. మండలంలో సుమారు 650 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. పొలాల్లో నిలిచిన నీటిని పిల్ల కాలువలు, అవసరమైతే ఆయిల్ ఇంజిన్లతో బయటకు తోడాలని రైతులకు సూచించారు. వర్ష ప్రభావం తగ్గిన తర్వాత బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకితే ప్లాంటోమైసిన్, కాపర్ ఆక్సీక్లోరైడ్ మందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ ఎన్. సీతారామమూర్తి, వీఏఏ పార్వతి పాల్గొన్నారు.