పాములేరు వాగు ఉధృతి పరిశీలన: రాకపోకలు నిలిపివేత
రిపోర్టర్: మహేష్
స్థలం: ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో పాములేరు వాగు వరద ఉధృతిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగు పొంగిపారడంతో తాళ్లపాయి నుంచి బూర్గంపహాడ్ వెళ్లే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశామని, వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ఆయన హెచ్చరించారు.