బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ రేసు కోసం తీవ్ర వాగ్వాదం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు పదో సీజన్లో క్యాప్టెన్సీ రేసు కోసం జరుగుతున్న పోటీలో ఇంటెన్స్ డ్రామా నెలకొన్నట్లు లేటెస్ట్ ప్రోమో వెల్లడించింది. అగ్నిపరీక్ష టాస్క్ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన అపూర్వ, మిథిలేశ్లకు బిగ్ బాస్ ఊహించని అవకాశం కల్పించారు. కెప్టెన్ పదవికి అనర్హులైన ఇద్దరు సభ్యుల పేర్లను సూచించాలని వారిని ఆదేశించారు. దీంతో అపూర్వ సృష్టిని, మిథిలేశ్ అమాన్ను ఎంపిక చేయడంతో హౌస్లో తీవ్ర వాగ్వాదం చెలరేగి వాతావరణం వేడెక్కింది.