జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో సంగీత దర్శకుడిగా శశ్వత్ సచ్దేవ్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న డ్రాగన్ చిత్రంలో సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శశ్వత్ సచ్దేవ్ పేరు పరిశీలనలో ఉందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.