రూ. 11,085 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమం

రిపోర్టర్: అశోక్ స్థలం: కోనసీమ

రూ. 11,085 కోట్ల భారీ నిధులతో గ్రామీణాభివృద్ధి కోసం పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని చేపట్టినట్లు అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ వెల్లడించారు. ఈ నిధుల ద్వారా పల్లెల పునర్నిర్మాణం జరగనుందని, గ్రామాల్లో సరికొత్త ప్రగతి కాంతులు వికసిస్తాయని ఆయన పేర్కొన్నారు. నవ్యాంధ్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ ముందుడుగుతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.