చిట్వేల్లో ఘనంగా సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలు
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలం కేకే వడ్డీపల్లి అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ ఉత్సవం, పోషణ్ మాసం కార్యక్రమాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని సూపర్వైజర్ సురేఖరాణి తెలిపారు. రోజువారీ ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలు తప్పనిసరిగా చేర్చాలని తల్లులకు సూచించారు.