స్వశక్తితో యువ వ్యాపారవేత్తగా ఎదిగిన విశాఖ యువకుడు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నానికి చెందిన యువకుడు దువ్వాడ సన్నీరాజా పట్టుదలతో సొంత కాళ్లపై నిలబడి ప్రత్యేక గుర్తింపు సాధించారని కాడ్యూ సంస్థ తెలిపింది. కేవలం పదహారేళ్ల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ప్రొటీన్ బ్రెడ్ తయారు చేస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. మార్కెట్లో లభించే ఆహార పదార్థాలపై పరిశోధన చేసి ప్రభుత్వ సహకారంతో ఈ పరిశ్రమను ప్రారంభించామని సన్నీరాజా పేర్కొన్నారు.