మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం గర్వకారణం
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 21ని ఇకపై ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ జీవో జారీ చేయడం గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురజాడ వారసులకు శాశ్వతంగా పెన్షన్ మంజూరు చేయడంతోపాటు ఆయన నివసించిన ఇంటిని పరిరక్షించామని మంత్రి వివరించారు.