బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు బెయిల్ మంజూరు

రిపోర్టర్: గోపి స్థలం: पश्चिम बंगाल

అత్యాచారం మరియు క్రిమినల్ బెదిరింపుల కేసులో అరెస్టై గత నెల రోజులకు పైగా కస్టడీలో ఉన్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు చించూరా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆగస్టు 11న అరెస్టయిన ఢిల్లీ కేపిటల్స్ ఐపీఎల్ ఆటగాడు పోరెల్, తనపై వచ్చిన ఆరోపణలను మొదట్నుంచీ ఖండిస్తూ వస్తున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అరెస్టయిన పోరెల్, సుమారు 36 రోజుల జైలు జీవితం తర్వాత కోర్టు నుంచి ఉపశమనం పొందారు.