జపాన్‌లో నిద్రపోతే రూ.13 లక్షల బహుమతి అందజేత

రిపోర్టర్: గోపి స్థలం: Japan

జపాన్‌లోని టోక్యోలో అక్టోబర్ 5, 2026న వినూత్నంగా నిద్రపోటీ నిర్వహించనున్నారు. ఈ పోటీలో విజేతకు దాదాపు రూ.13.76 లక్షల భారీ నగదు బహుమతి లభిస్తుంది. పోటీదారులు 90 నిమిషాల్లో తమ నిద్ర నాణ్యతను నిరూపించుకోవాలి. నిర్వాహకులు ప్రత్యేక పరికరాల ద్వారా ఎంత త్వరగా నిద్రపోయారు, ఎంత గాఢంగా నిద్రపోయారనేది పరిశీలిస్తారు. జపాన్‌లో నిద్రలేమి సమస్యపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న పోటీని ఏర్పాటు చేశారు.