భారత్ తో తొలి వన్డే: కోహ్లీ, రోహిత్ లపై మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కు ముందు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సాంట్నర్ వెల్లడించారు.