మూడో సంతానానికి యాభై వేల ఫిక్స్డ్ డిపాజిట్ బహుమతి ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: గుజరాత్
గుజరాత్లోని కచ్ కడ్వా పాటిదార్ సమాజ్ జనాభాను వృద్ధి చేసే లక్ష్యంతో వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ సామాజిక వర్గానికి చెందిన దంపతులు మూడో సంతానానికి జన్మనిస్తే, వారికి యాభై వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బహుమతిగా అందజేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దక్షిణ గుజరాత్లో తమ జనాభా క్రమంగా తగ్గుతుండటంతో, యువ జంటలను పెద్ద కుటుంబాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ సామాజిక పథకాన్ని అమలు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.