రామారావు మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్న బంజారా నేతలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
రామారావు మహారాజ్ బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని బంజారా సేవా సంఘం మండల నాయకులు అన్నారు. ఆదివారం మహారాజు వర్ధంతిని పురస్కరించుకుని జన్నారంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంజారా సమాజా ఐక్యత ఆత్మగౌరవం కోసం మహారాజ్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.