గ్రామీణ యువతకు ఉపాధి లక్ష్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పురోగతిపై సమీక్ష
రిపోర్టర్: సురేష్
స్థలం: గుంటూరు
గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి యువకుడు సుస్థిర ఉపాధి సాధించేలా పరిశ్రమలతో బలమైన అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.