రైతన్నలకు అలర్ట్: ముందస్తు నార్లు పోయవద్దని స్పష్టం చేసిన డీఏవో సత్యవాణి

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

సోమశిలలో పద్దెనిమిది టీఎంసీల నీరు మాత్రమే ఉందని, నవంబర్లో వర్షాలు కురిస్తేనే వరిసాగు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు నార్లు పోయవద్దని జిల్లా వ్యవసాయ అధికారిణి సత్యవాణి స్పష్టం చేశారు. నెల్లూరులో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్లో రైతులు అడిగిన వివిధ సందేహాలపై ఆమె మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని రైతులకు ఆమె సూచించారు.