పుంగనూరు దాడులపై రామచంద్రయాదవ్ సంచలన ఆరోపణలు: పెద్దిరెడ్డి కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి

రిపోర్టర్: మహేష్ స్థలం: Tirupati

అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన దాడులకు వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమే ప్రధాన కారణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు వారిని జైల్లో ఉంచాలని కోరారు. దాడుల వెనుక ఎంపీ మిథున్ రెడ్డి కుట్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు.