సెలెక్టర్ల తీరు వల్లే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్: వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు అర్ధాంతరంగా వీడ్కోలు పలకడానికి సెలెక్టర్ల వ్యవహారశైలే కారణమని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ వెల్లడించారు. సెలెక్షన్ కమిటీ తనతో నడుచుకున్న తీరు పట్ల కోహ్లీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ఆ ఆవేదనతోనే ఆటకు గుడ్ బై చెప్పాడని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్ టూర్ కోసం విరాట్ తీవ్రంగా సన్నాహాలు చేసుకున్నప్పటికీ, సెలెక్టర్ల వైఖరి అతడిని తీవ్రంగా నొచ్చుకునేలా చేసిందని జాఫర్ స్పష్టం చేశారు.