రోడ్డు భద్రతపై అవగాహన: ద్రాక్షారామలో కొత్త ట్రాఫిక్ చట్టాలపై పోలీసుల ప్రచారం
రిపోర్టర్: శివ
స్థలం: కోనసీమ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. అలాగే నూతనంగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ చట్టాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.