స్మార్ట్ఫోన్ గేమింగ్ కోసం కొత్త జిటి ఎన్ఎక్స్ పెరిఫెరల్స్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ సరికొత్త జిటి ఎన్ఎక్స్ సిరీస్ గేమింగ్ పెరిఫెరల్స్ను అధికారికంగా విడుదల చేసినట్లు గురువారం ప్రకటనలో వెల్లడించింది. మొబైల్ గేమింగ్ అనుభవాన్ని పెంచేలా జిటి ఎన్ఎక్స్ కంట్రోలర్ మరియు జిటి ఎన్ఎక్స్ స్టేషన్లను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త హార్డ్వేర్ పరికరాలు స్మార్ట్ఫోన్ను పోర్టబుల్ గేమింగ్ కన్సోల్గా మారుస్తాయని, గేమర్లకు అత్యుత్తమ కంట్రోల్ అనుభవాన్ని అందిస్తాయని ఇన్ఫినిక్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.