హైదరాబాద్లో భారీ భూముల వేలం: రెండు వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా హెచ్ఎండీఏ నిర్ణయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
నగరంలోని అత్యంత ఖరీదైన ప్రైమ్ లొకేషన్లలో ఉన్న భూములను విక్రయించి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. నవంబర్ నెలాఖరున ఈ వేలం ప్రక్రియను నిర్వహించేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కోకాపేట్ నియోపొలీస్తో పాటు బంజారాహిల్స్, బచపల్లి, ఇన్ముల్ నర్వ తదితర ప్రాంతాల్లోని మొత్తం నూట పద్నాలుగు భూ పార్శిళ్లను వేలంలో ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.