వయాగ్రా మందులతో కంటి చూపునకు ముప్పు ఉందా?

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

వయాగ్రా, టడలాఫిల్ వంటి శృంగార ఉద్దీపన మందులను దీర్ఘకాలం వాడటం వల్ల గ్లాకోమా అనే కంటి వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 74 వేల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించిన శాస్త్రవేత్తలు, క్రమం తప్పకుండా ఈ మందులు వాడిన వారిలో కంటి సమస్యలు తలెత్తే అవకాశం కొద్దిగా పెరిగినట్లు గుర్తించారు.