బెంగళూరులో అపార్ట్మెంట్ ప్రాంగణంలో కూడా ట్రాఫిక్ జామ్ వీడియో వైరల్

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ప్రధాన రోడ్లకే పరిమితం కాకుండా అపార్ట్మెంట్ ప్రాంగణాలకూ పాకాయని ఓ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో నివాస సముదాయం లోపల కార్లు బారులు తీరిన దృశ్యాలను ఆమె రికార్డు చేశారు. కేవలం బయటకు రావడానికి అపార్ట్మెంట్ వాసులు సుమారు అభ ఇరవై నిమిషాల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని, ఐటీ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయికి చేరాయో ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.