టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు నటి సుస్మితా శెట్టి ఎంట్రీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

మ్యాడ్ స్క్వేర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ సుస్మితా శెట్టి కోలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించారు. వీజే సిద్ధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న దయాంగారం చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తమిళ రంగ ప్రవేశంతో తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకువెళుతున్నట్లు సమాచారం.