కడ్తాల సాయిబాబా ఆలయంలో వైభవంగా లలితా పరాశక్తి మాత లక్ష పుష్పార్చన

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీ శ్రీ శ్రీ లలితా పరాశక్తి మాత రెండవ వార్షికోత్సవం సందర్భంగా లక్ష పుష్పార్చన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పండితులు లక్ష పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, లీలా లక్ష్మారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.