హైదరాబాద్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై భక్తుల తీవ్ర అసహనం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
నగరంలోని పలు చెరువుల్లో నీరు లేకపోవడం మరియు అధికారులు సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వినాయక నిమజ్జనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నిజాంపేట్, కూకట్‌పల్లి, హుస్సేన్‌సాగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో పాటు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలు నిలిపివేస్తూ పోస్టర్లు వెలువడటంపై గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తీవ్ర అసంతృప్తి మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.