మధ్యప్రదేశ్ లో ఘోరం: పోలీసు అధికారి మృతితో రాజకీయ కలకలం
రిపోర్టర్: మహేష్
స్థలం: Dewas
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో అక్రమ మద్యం రవాణాను అడ్డుకునే క్రమంలో ఎస్ హెచ్ ఓ దిలీప్ పూరి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర సంచలనం సృష్టించిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న నిందితుడు రాహుల్ జైస్వాల్ తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తినని విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. మద్యం దుకాణంలో వాటాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నట్లు తేలడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది.