వాహనదారులకు షాక్: ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సాంకేతిక లోపాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
వాహనదారులకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల ఎంపిక కత్తిమీద సాములా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహన్ పోర్టల్‌లో బిడ్డింగ్ సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు చెల్లించినా నంబర్లు కోల్పోవాల్సి వస్తోందని ప్రహ్లాద్ తదితరులు వాపోయారు. కేంద్ర పోర్టల్‌కు ఆర్టీఏ సేవలు మారడంతో ఫీజులు భారీగా పెరిగాయని, ఆన్లైన్ ఇబ్బందులపై తక్షణమే స్పందించి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని వాహనదారులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.