జూన్ 2027 నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక, చట్టపరమైన సమస్యల వల్ల పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించి వరంగల్ మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు తీరుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.