ఈ నెల 10న ఆమనగల్లులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన గురువందన కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించనున్నట్లు విద్యా కమిటీ చైర్మన్ లయన్ ఎన్. సుధీర్ రెడ్డి తెలిపారు. కడ్తాల్ జడ్పిఎచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పీఎంసీసీ లయన్ ఎస్. నరేందర్ రెడ్డి, పీడీజీ లయన్ జి. చెన్నకిషన్ రెడ్డి హాజరై అవార్డులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు.