మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ 94వ జయంతి సందర్భంగా 14 అడుగుల విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్మోహన్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆర్టీఐ, ఉపాధి హామీ వంటి చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.