సైబర్ నేరాలపై హన్మకొండ పోలీసుల హెచ్చరిక: బ్యాంక్ ఖాతాలు ఇస్తే గుణపాఠం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హన్మకొండ

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ పోలీసులు హెచ్చరించారు. ఎవరికైనా బ్యాంక్ ఖాతాలు ఇవ్వడం, ఓటీపీ లేదా ఏటీఎం పిన్ నంబర్లు ఇతరులతో పంచుకోవడం చట్టరీత్యా నేరమని వారు స్పష్టం చేశారు. అపరిచితుల నుంచి వచ్చే నకిలీ లావాదేవీలకు స్పందించి మోసపోవద్దని, ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హన్మకొండ పోలీసులు సూచించారు.