విశాఖలో మానవతా దృక్పథంతో కమ్యూనిటీ ఫ్రిజ్ల ద్వారా ఉచితంగా ఆహార పంపిణీ

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

ఆకలితో ఉన్న పేదలకు మరియు నిరాశ్రయులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. ఆహారం వృథా కాకూడదు మరియు ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే గొప్ప సంకల్పంతో ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తున్నామని VizagCityPolice పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్లను ప్రారంభించి అభినందనీయమైన రీతిలో నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.