పొదలకూరులో సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

పొదలకూరు సంగం రోడ్డు నుంచి టీపీ నగర్ వరకు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్రెడ్డి, బిట్–3 ఎంపీటీసీ అభ్యర్థి షేక్ ఖాదర్భాషాతో కలిసి బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.