రాజకీయ సంచలనం: తెలంగాణ భవన్లో నేడు హరీష్ రావు ప్రెస్మీట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: సిద్దిపేట

తెలంగాణ భవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు హరీష్ రావు ఆఫీస్ (@harishraooffice) వెల్లడించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై కీలక విషయాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఈ మీడియా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.